మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి

Published Tue, Nov 26 2024 12:11 AM | Last Updated on Tue, Nov 26 2024 12:11 AM

మద్యం

మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి

వేములవాడరూరల్‌: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, అత్తపై రోకలి బండతో దాడి చేసిన ఘటన వేములవాడ రూరల్‌ మండలంలోని మర్రిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన లంకదాచారి లచ్చవ్వ తన కూతురు జలకు మర్రిపల్లికి చెందిన మొగిలి రాముతో వివా హం జరిపించింది. ఈ దంపతులకు మూడేళ్ల పాప ఉంది. మద్యానికి బానిసైన రాము తరచూ భార్య ను కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె కొన్ని నెలలపాటు పుట్టింట్లోనే ఉంది. 15 రోజుల క్రితం కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, పెద్దల సమక్షంలో అత్తగారింటికి పంపారు. అయితే, రాములో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో లచ్చవ్వ శనివారం తన కూతురిని చూడటానికి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న రాము అత్త, భార్యతో గొడవపడి, రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. మారుపాక లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి1
1/1

మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement