సంతోషంగా ఉంది
ఆరోగ్యం కోసం గ్రౌండ్‌లో నిత్యం వాకింగ్ చేస్తున్నాం. ఇక్కడ చాలామందిమి కలిసి మిత్రులుగా ఏర్పడ్డాం. ఆపదలో ఉన్న పేదలకు చేయూతనిచ్చే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆరోగ్యం, ఆహ్లాదంతోపాటు మనసుకు తృప్తి లభిస్తోంది. ఇంతమంది మిత్రులు ఉండటం నా అదృష్టం.
– జక్కం శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు
తృప్తినిస్తోంది
తోటి మిత్రులతో కలిసి సామాజిక సేవ చేయడం తృప్తినిస్తోంది. నిత్యం 200 మంది స్నేహితులం కలిసి వాకింగ్ చేయడం, కష్టసుఖాలు పంచుకోవడం వల్ల గొప్ప అనుభూతి కలుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతాం.
– మామిడి సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్
ఆదుకోవడమే లక్ష్యం
మేం ఒక సమూహంగా ఏర్పడ్డాం. మాలో ఎవరికి ఆపద వచ్చినా అందరం స్పందిస్తాం. ఆర్థికసాయం చిన్నదైనా ఆదుకోవడమే మా లక్ష్యం. అందులోనూ అట్టడుగు వర్గాలకు సాయం చేయడంపై దృష్టి పెట్టాం. భవిష్యత్‌లో విద్య, వైద్యం, పేదల వివాహాలకూ చేద్దామని అనుకుంటున్నాం.
– దాసరి రఘు, వాకర్స్ కమిటీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment