ఆహారంలో నాణ్యతాలోపంపై చర్యలు
ధర్మపురిలో గోదావరికి గంగాహారతి
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యతా లోపంపై కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం చర్యలు తీసుకుకున్నారు. బా ధ్యులైన ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు మరో ముగ్గురికి మెమో జారీ చేశారు. కొడిమ్యాల మండలంలోని చెప్యాల జెడ్పీహెచ్‌ఎస్ ఫుడ్ ఇన్‌చార్జి వెంకటరమణారావు(ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్) సస్పెండ్ అయ్యారు. అలాగే, ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామికి మెమో ఇచ్చారు. మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్/కళాశాల ఫుడ్ ఇన్‌చార్జి కిశోర్‌ను సస్పెండ్ చేయగా, ప్రిన్సిపాల్ మాధవీలతకు మెమో, చెప్యాల ఎంపీపీఎస్‌లో ఫుడ్ ఇన్‌చార్జిగా ఉన్న ప్రవీణ్‌కుమార్ (ఎస్‌జీ టీ)కు మెమో జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించినా కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ధర్మపురి: కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి గోదావరికి సోమవారం(24వ రోజు) గంగాహారతి నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి గోదావరి నదికి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో వెళ్లారు. ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరిని సస్పెండ్ చేసిన
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
ముగ్గురికి మెమో జారీ
Comments
Please login to add a commentAdd a comment