భాషతో పాటు భావ వ్యక్తీకరణ ముఖ్యం
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: విద్యార్థులకు భాషతోపాటు భావవ్యక్తీకరణ, విషయంపై అవగాహన ముఖ్య మని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టెక్నాలజీ ఎంటర్‌టైన్‌మెంట్ డిజైన్(టీఈడీ) స్టూడెంట్స్ టాక్ కార్యక్రమానికి పంపేందుకు పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండలస్థాయి ఎంపిక కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (ధన్గర్‌వాడీ) పాఠశాలలో సోమవారం నిర్వహించారు. హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులతో మాట్లాడారు. తెలుగుతో పాటు ఆంగ్లభాష కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలిక ఎప్పటికై నా ప్రపంచ వేదికపై ఉపన్యాసం ఇవ్వాలని తన కోరికగా ఆకాంక్షించారు. పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, మండల వి ద్యాధికారి అబ్దుల్ అజీమ్, సర్వ శిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
సర్వే మిస్సయ్యిందా?
● 98499 06694 నంబరుకు కాల్ చేయండి
కరీంనగర్ కార్పొరేషన్: నగరవాసులకు ఎవరికై నా సమగ్ర కుటుంబ సర్వే జరగకపోతే తమకు సమాచారం ఇవ్వాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ కోరారు. సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సర్వే సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నగరంలోని ఏ డివిజన్‌లోనైనా ఇంటికి స్టిక్కర్ వేయకున్నా, కుటుంబ సర్వే చేయకుండా తప్పిపోయినా తమకు తెలియచేయాలని సూచించారు. నగరపాలకసంస్థ కాల్‌సెంటర్ నంబర్ 98499 06694కు కాల్‌చేసి చెప్పాలన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్‌లు ఏ ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టకుండా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆస్తి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి
నగరంలో ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహ త్ బాజ్‌పేయ్ ఆదేశించారు. ఇంటింటి కుటుంబ సర్వే పనులు బిల్‌కలెక్టర్లకు లేనందున, ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, ఇన్‌చార్జి ఏసీపీ వేణు ఉన్నారు.
1న రైతు సదస్సు
విద్యానగర్(కరీంనగర్): తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో డిసెంబర్1న 5వ వార్షికోత్సవ రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు విశాంత్ర న్యాయమూర్తి బి.చంద్రకుమార్ తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు మేరకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్నారు. డిసెంబర్ 1న ఉదయం హైదరాబాద్‌లోని సందరయ్య విజ్ఞా న కేంద్రంలో జరిగే సదస్సులో రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, సదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఓర్సు ఇంద్రసేనా, వి.నర్సింహ , మహేశ్, వర్ల వెంకట్‌రెడ్డి, సు తారి లచ్చన్న, చందనగరి గోపాల్, బొడ్డు దేవ య్య, రఘు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
సీసీఐ కొనుగోళ్లు పరిశీలన
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధి లోని సీసీఐ నోటిఫై చేసిన సరిత కాటన్, సీతా రామ కాటన్, రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లులను జిల్లా మార్కెటింగ్ అధికారి(డీఎంవో) ప్రకాశ్, మార్కెట్ ఉన్నత ణి కార్యదర్శి మల్లేశం సోమవారం సందర్శించారు. కొనుగోళ్లు, రైతుల వివరాలను పరిశీలించారు. జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.6,900 పలికింది. 38 వాహనాల్లో 298 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment