పరిష్కారం కోసం పడిగాపులు
● ప్రజావాణిలో అర్జీదారుల బారులు
కరీంనగర్ అర్బన్: అవే సమస్యలు.. అవే నివేదనలు.. వచ్చిన వారే మళ్లీ మళ్లీ అర్జీలు ఇవ్వడం, పరిష్కారం కోసం పడిగాపులు కాయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని పలుశాఖలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 193 అర్జీలు రాగా కలెక్టర్ పమేలా సత్ప తి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు.
మొత్తం అర్జీలు: 193
మున్సిపల్ కార్పొరేషన్: 23
ఆర్డీవో కరీంనగర్: 15
వారధి సొసైటీ: 13
కరీంనగర్ రూరల్, తహసీల్దార్: 10
రామడుగు తహసీల్దార్: 07
డీపీవో: 06
మానకొండూరు తహసీల్దార్: 06
కరీంనగర్ అర్బన్ తహసీల్దార్: 06
Comments
Please login to add a commentAdd a comment