● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌టౌన్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 18 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో బతుకీడుస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హమీ ఇవ్వడంతోపాటు విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ... ఆర్టిజన్ల డిమాండ్ న్యాయమైనదేనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి కొత్త ఫ్యాక్టరీ చట్టం 1946 స్టాండింగ్ సర్వీస్ రూల్స్‌ను విద్యుత్ సంస్థ తెరపైకి తెచ్చి ఆర్టిజన్లను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చడం ఎంతవరకు సమంసజమని ప్రశ్నించారు. తక్షణ మే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టిజన్ల విద్యార్హతల మేరకు రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టిజన్లతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment