పదకొండు నెలల్లో హామీలన్నీ నెరవేర్చాం
హుజూరాబాద్: ‘పదకొండు నెలల్లోనే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాం. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చే స్తున్నాయి’ అని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ.. రైతుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా వందరోజుల్లోనే రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసాపై మంత్రివర్గం సబ్‌కమిటీ వేసి జిల్లాలో పర్యటించడం జరుగుతుందని అన్నారు. రూ.20వేలకోట్ల ప్రభుత్వ సొమ్ము మిల్లర్ల వద్ద ఉందని, బకాయిలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రాష్ట్రంలో ఎవరికై నా రాకపోతే చెప్పాలన్నారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా బీఆర్‌ఎస్ నాయకుల వ్యవహర శైలి తయారైందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని, నిరుపేదలకు మొదటి దశలో వస్తాయన్నారు. కులగణన సర్వే దేశంలోనే పెద్ద మార్పుకు స్వీకారం చుట్టిందని, ఇది దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. వేములవాడ ఆలయాభివృద్ధికి రూ.35.25 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గూడురి రాజేశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించి, శుభాకాంక్షలు తెలిపారు.
సచివాలయం కేంద్రంగా కాంగ్రెస్ పాలన
ఫామ్‌హౌస్ ద్వారా బీఆర్‌ఎస్ పాలన ఉంటే, సచివాలయం కేంద్రంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మార్కెట్ కమిటీలు రైతులకు భరోసా ఇచ్చేలా పనిచేయాలన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రూ.7లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, నెలకు రూ.6వేల కోట్ల అప్పు కట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్‌ఎస్ పాలన సమయంలో హుజూ రాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోయినా, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎలా పంపిణీ చేశారో సమాధానం చెప్పాలన్నారు.
కుల గణన సర్వే దేశానికే దిక్సూచి
బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment