‘కేశోరాం’లో కార్మికుల సమ్మె
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ కేశోరాం సి మెంట్ కర్మాగారంలో కార్మికులు సోమవారం సమ్మె కు దిగారు. దీపావళి బోనస్ రూ.52వేలు చెల్లించాల నే డిమాండ్‌తో ఉదయం విధులు బహిష్కరించారు. కంపెనీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. పర్మి నెంట్, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల అధ్యక్షులు బయ్య పు మనోహర్‌రెడ్డి, కౌశిక హరితోపాటు ప్రధాన కార్యదర్శులు దాడి మహేశ్, మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులు ఒకవైపు, పర్మినెంట్ కార్మికులు మరోవైపు నిరసన తెలిపారు. ఉదయం షిఫ్ట్ సమయంలో సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ పార్థసారథి ఆందోళనకారుల వద్దకు వచ్చి.. ఉన్నతాధికారులతో చర్చించేందుకు ఒకరోజు గడువు ఇవ్వాలని, సమ్మె విరమించాలని కోరారు. నాయకులు అందుకు అంగీకరించలేదు. వారం క్రితమే సమ్మె నోటీసు అందించామని, అయినా యాజమాన్యం నుంచి స్పందన రాలేదని, అందు కే సమ్మెకు దిగామని కార్మికులు, నాయకులు తేల్చి చెప్పడంతో మేనేజర్ వెనుదిరిగి వెళ్లిపోయారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో బసంత్‌నగర్ ఎస్సై స్వామి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే అసమర్థతే కారణం..
బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం గౌరవ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అసమర్థతతోనే కార్మికులకు బోనస్ వి షయంలో అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని దొంగ నిరాహార దీక్షతో కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. కార్మికులకు రూ.52వేల చొప్పున బోనస్ చెల్లించాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె తీవ్రరూపం దాల్చకముందే ఎమ్మె ల్యే కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు.
29న చర్చించేందుకు నిర్ణయం
కార్మికుల బోనస్‌పై ఈనెల 29వ తేదీన అసిస్టెంట్ లేబర్ కమిషనర్(ఏఎల్‌సీ) సమక్షంలో చర్చలు జరగనున్నట్లు పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బయ్యపు మనోహర్‌రెడ్డి, దాడి మహేశ్ తెలిపారు. కంపెనీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల సమ్మెతో కేశోరాం అధికారులు, పర్మినెంట్ కార్మికసంఘం నాయకులను ఏఎల్‌సీ యూసుఫ్ చర్చలకు ఆహ్వానించారని తెలిపా రు. కార్మికశాఖ నిబంధనల ప్రకారం సమ్మెకు 14రో జుల ముందు నోటీస్ ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. పర్మినెంట్ కార్మికులకు ఈఏడాది రూ.52వేలు, వ చ్చేఏదాది రూ.54వేలు, ఆ తర్వాత రూ.57వేల దీ పావళి బోనస్ చెల్లించాలని తాము డిమాండ్ చేశామని, కంపెనీ అధికారులు రూ.35,800, 36,800, 37,800 వరుసగా మూడేళ్లు చెల్లిస్తామని అన్నారని తెలిపారు. తాము దీనికి ఒప్పకోలేదని, ఈనేపథ్యంలో ఈనెల 29న ఇరువర్గాలతో మరోసారి చర్చలు జరుపుతామని, అప్పటివరకు సమ్మెను విరమించా లని విన్నవించగా, తాము సమ్మె విరమిస్తున్నట్లు మ నోహర్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు.. కాంట్రాక్ట్ కా ర్మిక సంఘం నాయకులు రాత్రివరకూ ఆందోళన చే యగా.. హెచ్‌ఆర్ మేనేజర్ పార్థసారథి.. కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరితో మాట్లాడా రు. ఈనెల 29న ఏఎల్‌సీ సమక్షంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నాయకులు, కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
కంపెనీ మెయిన్ గేట్ ఎదుట ధర్నా
స్పందించిన హెచ్‌ఆర్ మేనేజర్
కార్మిక నేతలతో సమావేశం
29న ఏఎల్‌సీ సమక్షంలో చర్చలకు ఇరువర్గాల అంగీకారం
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment