నిషేధంపై నిర్లక్ష్యం
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలోకి భక్తులు సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రధాన ఆలయంలోకి వెళ్లే అర్చకులు, సిబ్బంది ఎవరైనా సరే తమ ఫోన్లను బయటపెట్టి రావాలి. కానీ ఆలయంలో భక్తులతో పాటు అర్చకులు, సిబ్బంది ఇష్టారీతిన మూలవిరాట్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.
నిర్లక్ష్యమెందుకు?
కొండగట్టు ఆలయంలో సెల్ఫోన్ నిషేధం ఉన్నట్లు అధికారులు సూచికలు ఏర్పాటు చేశారు. కానీ ఎవరు పడితే వారు మూలవిరాట్ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. శాస్త్రం ప్రకారం మూలవిరాట్ను స్వయంగా వచ్చి దర్శించుకోవాలి తప్ప ఫొటోలు, వీడియోలు తీయరాదని అర్చకులు చెబుతున్నారు. వేరే ఆలయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొండగట్టు ఆలయంలో కూడా 2022లో సెల్ఫోన్లు భద్రపరిచే టెండర్ పిలిచారు. సదరు టెండర్ పూర్తి కాగా మళ్లీ అధికారులు నిర్వహించలేదు. అప్పటినుంచి ఎవరు పడితే వారు ఆలయంలోకి ఫోన్లు తీసుకెళ్లి ఫొటోలు తీస్తున్నారు. కొన్నిసార్లు ఫొటోలు తీసే క్రమంలో భక్తులకు అధికారులకు గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా ఆలయ అధికారులు సెల్ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా కట్టుదిట్టంగా నిషేధం అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.
అంజన్న ఆలయంలో యథేచ్ఛగా సెల్ఫోన్ల వినియోగం
మూలవిరాల్ ఫొటోలు, వీడియోలు తీస్తున్న భక్తులు పట్టించుకోని ఆలయ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment