చికెన్‌తో అధికారుల విందు భోజనం?
రుద్రంగి(వేములవాడ): గణతంత్ర దినోత్సవం వేళ రుద్రంగి మండలంలో అధికారుల విందు భోజనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పండుగలైన స్వాతంత్య్ర, గణతంత్ర, గాంధీ జయంతి రోజుల్లో జీవ హింస చేయరాదని అందరికీ తెలిసిందే. అధికారులు సైతం చికెన్, మటన్ సెంటర్లను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. కాగా, ఆదివారం గణతంత్ర దినోత్సవం రోజు రుద్రంగి రైతు వేదికలో కొందరు మండల స్థాయి అధికారులు ఓ మండల అధికారి ఇచ్చిన చికెన్ విందు భోజనానికి హాజరై తృప్తిగా ఆరగించారు. అధికారులే ఇలా చికెన్ విందు భోజనం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment