నీటికుంటలో పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి వ్యక్తి మృతి

Published Mon, May 6 2024 5:40 AM

నీటిక

మాలూరు: వ్యవసాయ గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తాలూకాలోని దొమ్మరహళ్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బప్ప (57) మృతుడు. సుబ్బప్ప సాయంత్రమైనా కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు వెతగ్గా నీటికుంటలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు విచారణ చేపట్టారు. ప్రమాదశాత్తు నీటికుంటలో పడిపోయినట్లు భావిస్తున్నారు.

కరగ వీర కుమారుల ఊరేగింపు

మాలూరు: పట్టణంలోని ప్రసిద్ద ధర్మరాయస్వామి ద్రౌపదాంబ దేవాలయ కరగ ఉత్సవాలలో భాగంగా ఆదివారం కరగ పూజారి సందప్ప, వీరకుమారులతో కలిసి పట్టణంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ ధర్మరాయ స్వామి దేవాలయ కరగ ఉత్సవాన్ని ప్రతియేటా సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కరగలో ఒక్కో రోజు ఒక్కొక్క విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 300లకు పైగా వీర కుమారులు గోవింద నామస్మరణ చేస్తూ కరగ పూజారికి సహకారం అందిస్తారు. ఆదివారం రాత్రి శక్తి ఉత్సవం జరుగుతుంది, ఇందుకోసం దేవాలయం సకల సౌకర్యాలను సిద్ధం చేసింది.

దేవాలయం హుండీ చోరీ

కోలారు: ముళబాగిలు తాలూకా సంగసంద్ర గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో హుండీలోని నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. హుండీలో ఉన్న రూ. 10 వేల నుంచి 15 వేల నగదు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, గ్రామ లెక్కాధికారి ప్రియాంక, దేవాలయానికి వెళ్లి పరిశీలన జరిపారు. ముళబాగిలు రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

నీటికుంటలో పడి వ్యక్తి మృతి
1/1

నీటికుంటలో పడి వ్యక్తి మృతి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement