మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

Published Mon, May 6 2024 2:05 PM

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

కోలారు: పొగాకు, మాదకద్రవ్యాల వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సునీల్‌ ఎస్‌ హొసమని తెలిపారు. ఆదివారం నగరంలోని చైతన్య కళాశాలలో నిర్వహించిన కానూను అరివు–నెరవు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. చెడు అలవాట్లకు బానిసలైతే జీవితం నాశనమవుతుందన్నారు. విద్యా సంస్థల్లో ఎక్కడైన డ్రగ్స్‌ గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 18 సంవత్సరాల పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నేరమన్నారు. చట్టాల గురించి తెలియక నేరాలు చేసినా శిక్షల నుంచి తప్పించుకోవడానికి సాధ్యం కాదన్నారు. చట్టాల గురించి సరైన అవగాహన ఉంటే నేరాలు జరగవన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వేక్షణ అధికారి డాక్టర్‌ ఎం ఎ చారిణి, చైతన్య కళాశాల ప్రిన్సిపాల్‌ మహమ్మద్‌ షోయబ్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తి సునీల్‌ ఎస్‌ హొసమని

Advertisement
Advertisement