రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి

Published Mon, Aug 26 2024 11:28 AM | Last Updated on Mon, Aug 26 2024 11:28 AM

-

హుబ్లీ: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హత్యాచారం, వరుస హత్యలు నిరంతరంగా జరుగుతున్నాయని స్థానిక హుబ్లీ ధార్వాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మహేష్‌ టెంగినకాయి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కళ్లు మూసుకొని కూర్చొవడం దారుణన్నారు. ముడా కుంభకోణంలో ఇరుక్కున్న సీఎం తన పదవిని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారని, దీనికి మంత్రి వర్గం మొత్తం అండగా నిలిచిందన్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారన్నారు. దీంతో శనివారం ఉడుపి జిల్లా కార్కల్‌లో జరిగిన హత్యచార ఘటన సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేసిందన్నారు. హిందువులపై నిరంతరంగా హత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సిద్దు ప్రభుత్వంపై మండిపడ్డారు.

మైనర్లు డ్రైవింగ్‌.. తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా

హుబ్లీ: నగరంలో ఇటీవల మైనర్లు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడిన ఘటనలో వారి తల్లిదండ్రులకు ఇక్కడి కోర్టు భారీ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల క్రితం లక్ష్మీ భజంత్రి, సుకేత్‌, సతీశ్‌, కృష్ణారామ్‌లకు చెందిన పిల్లలు బైక్‌లు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వారు మైనర్లు కావడంతో కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. ఈ కేసులను విచారణ చేసిన హుబ్లీ 3వ జేఎస్‌ఎఫ్‌సీ కోర్టు పిల్లల తల్లిదండ్రులను తీవ్రంగా హెచ్చరిస్తూ ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున జరిమానా విధించింది. మైనార్టీ తీరని పిల్లలకు బైక్‌లు ఇవ్వడం ప్రమాదకరమని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు యువకులు సిద్ధం కావాలి

కేజీఎఫ్‌: యువకులు ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ముందుకు రావాలని భగవాన్‌ మహావీర్‌ జైన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రేఖాసేథి తెలిపారు. ఆదివారం కళాశాల భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, రోవర్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని స్కౌట్స్‌ భవనంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌ సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మనచుట్టూ ఉన్న పరిసరాలు, పాఠశాల, దేవాలయాలు, ఆస్పత్రి, బస్టాండు తదితర స్థలాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పాఠశాలలు ఆకర్షణీయంగా ఉంటేనే విద్యార్థుల అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు. తమ కళాశాల నుంచి నెలకోమారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కౌట్స్‌ కమిషనర్‌ సురేష్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది 200 పైగా కళాశాల, పాఠశాలల్లో తమ దళాలలను ప్రారంభించడానికి అవసరమైన శిక్షణను ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement