శివాజీనగర: ప్రాసిక్యూషన్ అనుమతితో కలవరపాటులో ఉన్న సీఎం సిద్దరామయ్యకు బీసీ, ఎస్సీ సముదాయాలకు చెందిన స్వామీజీలు ఆదివారం నివాసంలో కలిసి ధైర్యం చెప్పారు. కుట్రలకు వ్యతిరేకంగా ఐక్యతతో సిద్దరామయ్య తరఫున పోరాడుతామని తెలిపారు. నిరంజనానందపురి స్వామి (కాగినెల కనక పీఠం), శాంతివీర స్వామీజీ (కుంచిటిగ సంస్థాన హొసదుర్గ), హిమ్మడి సిద్దరామేశ్వర స్వామీజీ (భోవి గురుపీఠం చిత్రదుర్గ), బసవమూర్తి మాదర చన్నయ్య స్వామి (మాదర చిన్నయ్య గురుపీఠం చిత్రదుర్గ), పురుషోత్తమానందపురి స్వామి (భగీరథ పీఠం మధురె) తదితరులు సీఎంను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment