భారీగా టపాసుల క్షతగాత్రులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో టపాసులు కాల్చుతూ సుమారు 120 మందికి పైగా కళ్లకు గాయాలయ్యాయి. అలాగే మరో 100 మందికి పైగా శరీరంపై గాయాలు తగిలాయి. ఏటేటా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి మొత్తం 220కి పైగా ప్రమాద ఘటనలు జరిగాయి. దీంతో ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. కళ్లకు గాయాలైన వారు మింటో ఆస్పత్రిలో చేరారు. శరీరంపై గాయాలైనవారు స్థానిక ఆస్పత్రుల్లో, తీవ్రంగా గాయపడిన వారు విక్టోరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈసారి బాణాసంచా కాల్చే వారి కంటే పక్కన ఉన్న వారికే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. మింటో ఆస్పత్రిలో సుమారు 49 మంది చికిత్స కోసం వచ్చారు. వీరిలో 35 మంది చికిత్స పొంది ఇళ్లకు వెళ్లగా ఇంకా 14 మంది అడ్మిట్ అయ్యారు. బాధితుల్లో 32 మంది చిన్నపిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment