● కార్య సిద్ధ రథోత్సవం
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కార్య గ్రామంలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ కార్య సిద్ధేశ్వర స్వామి జాతర మహోత్సవం వేలాదిమంది భక్తుల మధ్య వైభవంగా సాగింది. గద్దిగె ఆవరణలో సిద్ధేశ్వర స్వామి ఉత్సవమూర్తికి పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తిని తేరులో ఉంచి సిద్దలింగ శివాచార్య స్వామీజీ పూజలు చేశారు. భక్తులు జై కార్యసిద్ధేశ్వర అని నినాదాలు చేస్తూ తేరును లాగారు. కళాకారుల ప్రదర్శనలు కోలాహలం నింపాయి. సుమారు 600 అడుగుల ఎత్తులో ఉన్న కడిదాదా కొండ పైకి తేరును లాగారు.
Comments
Please login to add a commentAdd a comment