త్వరలో ఇళ్లను పంపిణీ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఇళ్లను పంపిణీ చేస్తాం

Published Mon, Aug 26 2024 11:28 AM | Last Updated on Mon, Aug 26 2024 11:28 AM

-

హుబ్లీ: అక్షర, ఆరోగ్య, ఆశ్రేయ, ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని కర్ణాటక కొళగేరి అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎమ్మెల్యే ప్రసాద్‌ అబ్బయ్య తెలిపారు. హుబ్లీ తూర్పు నియోజకవర్గం జంగ్లి పేట్‌ సర్కిల్‌లో మావనూరు బ్రిడ్జి, బానతికట్టి మెయిన్‌ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తాను ఆ మండలి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా రూ.36,789 ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసిన భాగ్యం కలిగిందన్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా మరో 34 వేల ఇళ్లను మురికి వాడల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామన్నారు. శాఖల సమన్వయం కొరత వల్ల నిర్మాణ పనులు పూర్తిగా విజయవంతం కావడంతో వెనుకంజ వేయడం శోచనీయం అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు శివగంగా, మన్సూర ముదగల్‌, పీడబ్ల్యూడీ ఈఈ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement