శివాజీనగర: భారత ప్రధాన న్యాయమూర్తి డీ.వై.చంద్రచూడ్ శుక్రవారం కుటుంబ సమేతంగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా యళందూరులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బిళిగిరి రంగన కొండను సందర్శించారు. కొండపై బిళిగిరి రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్‌కు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఆ తరువాత బిళిగిరిరంగన కొండ నుంచి కే.గుడికి తరలివెళ్లి అటవీ సౌందర్యాన్ని వీక్షించారు. మధ్యాహ్నం చామరాజనగర హరళుకోటి ఆంజనేయ సన్నిధికి చేరుకొని హనుమను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు.
సీసీబీ పోలీసులపై ఫిర్యాదు
బనశంకరి: బెంగళూరు నగర శివారులో నిర్వహించిన రేవ్‌పార్టీ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీబీ పోలీసులపై దోపిడీ, ఇతర నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త విజయ్‌డెన్నిస్ లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రేవ్‌పార్టీపై మే 19 తేదీన దాడి చేసిన సీసీబీ పోలీసులు చట్టప్రక్రియ చేపట్టకుండా దోపిడీ చేశారు. పార్టీలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేస్తామని బెదిరించి తలా రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వ్యక్తి మాదకద్రవ్యాలు సేవించినట్లయితే మెడికల్ రిపోర్టులో పాజిటివ్ వస్తుందని బెదిరించారు. వీరి వాహనాన్ని విడుదల చేయడానికి రూ.4 లక్షలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమకు అనుకూలమయ్యేలా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారని ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు పారదర్శకంగా దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ వేశామని విచారణ అధికారులపై ఫిర్యాదు చేయడం గురించి సమాచారం లేదని కమిషనర్ దయానంద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment