వృత్తి ఉద్యోగం, ప్రవృత్తి దొంగతనాలు
శివమొగ్గ: కేఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళ బ్యాగులో ఉన్న సుమారు రూ. 20 లక్షల విలువ చేస బంగారు ఆభరణాలు, పట్టుచీరలను చోరీ చేసిన మహిళను భద్రావతి న్యూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. భద్రావతి నగరలోని సీగేబాగి లేఔట్‌లో నివాసం ఉంటున్న కమలమ్మ (48) నిందితురాలు. ఈ మహిళ శివమొగ్గలోని కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో అటెండర్ పనిచేస్తోంది. కానీ త్వరగా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ఎంచుకుంది.
బస్సులో ప్రయాణిస్తూ
శివమొగ్గకు చెందిన ప్రభావతి అనే మహిళ ఈనెల 1వ తేదీన భద్రావతి నుంచి శివమొగ్గకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఆమె పక్క సీట్లోనే కమలమ్మ కూర్చుంది. బస్సు దిగిన తరువాత ప్రభావతి బ్యాగు చూసుకుంటే అందులో 287 గ్రాముల బంగారు నగలు, రెండు పట్టు చీరలు కనిపించలేదు. వెంటనే ఆమె భద్రావతి న్యూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని కనిపెట్టి అరెస్టు చేశారు. ఆమె నుంచి 277 గ్రాముల బంగారం, 2 పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు.
మహిళా దొంగ అరెస్టు
భారీగా బంగారం సీజ్
Comments
Please login to add a commentAdd a comment