TS Warangal Assembly Constituency: అరాచకాలను ఆపేందుకే సోనియా, రాహుల్‌గాంధీ నన్ను పంపించారు! : తుమ్మల నాగేశ్వరరావు
Sakshi News home page

అరాచకాలను ఆపేందుకే సోనియా, రాహుల్‌గాంధీ నన్ను పంపించారు! : తుమ్మల నాగేశ్వరరావు

Published Thu, Oct 26 2023 7:58 AM | Last Updated on Thu, Oct 26 2023 12:42 PM

- - Sakshi

మాట్లాడుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, ఖమ్మం: నిజాయితీ, నిబద్ధతను జీవితాంతం వదిలిపెట్టనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజులనరేందర్‌ ఆధ్వర్యాన బుధవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికలు ఖమ్మం ప్రజలకు, అక్రమ సంపాదనతో అరాచకాలు సృష్టించే వ్యక్తుల మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తనను పంపించారని చెప్పారు.

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. అప్పడు అవినీతి, సెటిల్‌మెంట్లకు చరమగీతం పాడుతామన్నారు. ఆ తర్వాత 8, 25, 32, 39, 54వ డివిజన్లలో జరిగిన సమ్మేళనాల్లో కూడా తుమ్మల మాట్లాడారు. అలాగే, డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌, రామకోటేశ్వరరావు తదితరులను కలిశారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్‌ సైదులు, కమర్తపు మురళి, చావా నారాయణరావు, నాయకులు పొదిల రవికుమార్‌, కొప్పెర ఉపేందర్‌, నాగండ్ల దీపక్‌చౌదరి, సోమనాథం, వడ్డెబోయిన నర్సింహారావు, కొత్తపల్లి శ్రీనివాస్‌, హుస్సేన్‌, అమ్జద్‌, జంగం భాస్కర్‌, మారగాని వెంకట్‌, రఘు, గట్టు నితీశ్‌, వెన్నం శ్రీధర్‌ పాల్గొన్నారు.
ఇవి చదవండి: 'ప్రజలు చందాలు పోగేసి గెలిపించారు' : మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement