స్వయంగా చూశా.. ఇక నాదే బాధ్యత
సత్తుపల్లి: దెబ్బతిన్న ఇళ్లు, సైలో బంకర్ ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించినందున సమస్యల పరిష్కారం బాధ్యత తనదేనని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ భరోసా ఇచ్చారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో సింగరేణి ఓసీతో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. సైలోబంకర్ వల్ల కాలుష్యం పెరిగి ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని, ఇటీవల కురిసిన వర్షాలతో అంబేద్కర్ కాలనీ నీట మునిగిందని స్థానికులు వివరించారు. కిష్టారం ఎస్సీ కాలనీలో బాంబు పేలుళ్లతో దెబ్బతిని కూలిపోతున్న ఇళ్లను పరిశీలించిన ఆయన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై ఎమ్మెల్యేతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం కిష్టారం జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూములను త్యాగం చేసిన వారిని బాధ్యత తమపై ఉందన్నారు. ఈమేరకు డీపీఆర్‌ను పరిశీలించి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. భవిష్యత్ తరాలకు అండగా నిలిచేలా కిష్టారం హైస్కూల్, ఆస్పత్రిని అద్భుతంగా తీర్చిదిద్దుమని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పదవి కంటే ప్రజలే తమకు ముఖ్యమని, ప్రజల తరఫున చివరివరకు పోరాడుతామని తెలిపారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, పీఓలు నర్సింహారావు, ప్రహ్లాద్, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, నీరజాదేవి, నాయకులు ఉడతనేని అప్పారావు, రావి నాగేశ్వరరావు, నరుకుళ్ల రవి, ములకలపాటి అప్పారావు, ధనుంజయ్, రామకృష్ణ పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన షాదీఖానా నిర్మాణం
కల్లూరు: కల్లూరులో షాదీఖానా నిర్మాణ పనులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. కల్లూరులో షాదీఖానా పనులను ఎమ్మెల్యే రాగమయితో కలిసి పరిశీలించిన ఆయన పనులు ఆగడానికి కారణాలు, స్థల వివాదంపై ఆరా తీశారు. నిధులు సరిపడా ఉన్నందున రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తామని, కబరస్తాన్‌కు కూడా త్వరలో భూములు గుర్తిస్తామని తెలిపారు. ఆర్‌డీఓ ఎల్.రాజేంధర్, తహసీల్ధార్ సాంబశివుడు, ఎంపీడీఓ కె.చంద్రశేఖర్, డీఆర్‌ఓ రాంసింగ్, పీఆర్ డీఈఈ రావిరాల రాంబాబు, ఏఎంసీ చైర్మెన్ భాగం నీరజాదేవి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సదర్ సయ్యద్ అలీ, ఎండీ.హనీఫ్, ఎస్‌డీ.ఇషాక్, యాకూబ్ అలీ, తురాబల్లి, ఉస్మాన్, పసుమర్తి చందర్‌రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పెద్దబోయిన శ్రీను, లక్కినేని కృష్ణ, షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు.
బాధితులను కచ్చితంగా ఆదుకుంటాం..
సింగరేణి ప్రభావిత ఇళ్లను
పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, ఎమ్మెల్యే రాగమయి
Comments
Please login to add a commentAdd a comment