భక్తజన బాసర | - | Sakshi
Sakshi News home page

భక్తజన బాసర

Published Thu, Oct 10 2024 12:40 AM | Last Updated on Thu, Oct 10 2024 12:40 AM

భక్తజ

● మూలా నక్షత్ర పూజలకు తరలివచ్చిన భక్తులు ● కిక్కిరిసిన శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణం ● చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు ● అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు ● పోలీసుల భారీ బందోబస్తు

అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూకట్టిన భక్తులు

భైంసా/బాసర: చదువుల తల్లి కొలువుదీరిన బాసరలో శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం బుధవా రం భక్తులతో కిటకిటలాడింది. దసరా శరన్నవరా త్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత శుభ ముహూర్తం, అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్ర పర్వదినాన అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ము ధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావుపటేల్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆల య ఈవో విజయరామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరినది వద్ద వేకువజాము నుంచి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వందల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా బాసర చేరుకున్నారు.

గంటలపాటు బారులు..

ఆలయ ప్రాంగణంలో భక్తులు అమ్మవారి దర్శనంకోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. క్యూలో ఉన్న భక్తులకు ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సేవలు అందించారు. భక్తులకు పాలు, మంచినీటి ప్యాకెట్లు అందించారు. భైంసా బృందం భక్తులకు పులిహోర పంపిణీ చేసింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన వ్యాపార సంఘం సభ్యులు, బాసర యువకులు ప్రత్యేక సేవలందించారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో అతిథి గృహాలు దొరకక ప్రైవేటు లాడ్జిల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గదులు దొరకక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్షర శ్రీకార మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ప్రత్యేక బందోబస్తు..

ఉత్సవాల్లో భాగంగా బాసర ఆలయ ప్రాంగణంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ని ర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఒకరోజు ముందుగా నే బాసర చేరుకుని భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్‌తో కలిసి శాంతి భద్రతలపై చర్చించారు. ఉదయం నుంచి బాసర రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, గోదావరి స్నానఘట్టాలు, ఆలయానికి వెళ్లే ప్రధాన కూడళ్లలో పోలీసులను మోహరించారు. వాహనాలను ఆల యం వైపునకు అనుమతించలేదు. నిజామాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు బాసర గోదావరి, ఆలయానికి మధ్య ఉన్న ప్రాంతంలో పార్కింగ్‌ ఏ ర్పాటు చేశారు. ఇక మహారాష్ట్ర, భైంసా, నిర్మల్‌, ఆ దిలాబాద్‌, మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాహనా లకు ఆలయానికి వెళ్లే మార్గంలో మరో పార్కింగ్‌ ఏ ర్పాటు చేశారు. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, అక్షరాభ్యాస మండపాల వద్ద పోలీసులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.

ఆదాయం రూ.29,94,850

బాసర: బాసర సరస్వతీమాత ఆలయంలో బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాస పూజలు, వివిధ అర్జిత సేవ టికెట్ల ద్వారా ఆలయానికి రూ.29,94,850 ఆదా యం వచ్చింది. రూ.వెయ్యి అక్షరాభ్యాసం ద్వారా రూ.16,21,000, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా రూ.97 వేలు, రూ.150 సాధారణ అక్షరాభ్యాసం ద్వారా రూ.91,350, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా రూ.10,050, రూ.100 ప్రత్యేక దర్శనం ద్వారా రూ.2,43,200, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా రూ.3,700, రూ.50 మండప ప్రవేశం ద్వారా రూ.21,050, అభిషేకం లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 4,05,000, చిన్న లడ్డూ ప్రసాదం ద్వారా రూ.3,12,500, పులిహోర ప్రసాదం ద్వారా రూ.1,64,000, విరాళాలు రూ.16వేలు, రాగి కాయిన్స్‌ అమ్మకం ద్వారా రూ.8వేల ఆదా యం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయ రామారావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భక్తజన బాసర1
1/2

భక్తజన బాసర

భక్తజన బాసర2
2/2

భక్తజన బాసర

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement