అన్నీ.. గేటు బయటే! | - | Sakshi
Sakshi News home page

అన్నీ.. గేటు బయటే!

Published Thu, Oct 10 2024 12:40 AM | Last Updated on Thu, Oct 10 2024 12:40 AM

అన్నీ

వాహనాల రిజిస్ట్రేషనైనా.. రెన్యూవలైనా కార్యాలయం బయటే..

ఎండలో వాహనదారులకు ఇక్కట్లు

ఇదేమని ప్రశ్నించే వారికి చుక్కలు చూపుతున్న అధికారులు

ఆసిఫాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో వింత పరిస్థితి

సాక్షి, ఆసిఫాబాద్‌: మీరు కొత్తగా ఏదైనా వాహనం కొనుగోలు చేశారా? లేదా పాత వాహనానికి ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ చేయించడానికి వెళ్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి..! మీరు గొడుగో లేదా టోపీనో తీసుకెళ్లండి? వీలయితే ఓ వాటర్‌ బాటిల్‌ను సైతం తీసుకెళ్తే మంచిది.. ఎందుకంటే మీరు అక్కడ ఆర్టీఏ అధికారులు మిమ్మల్ని గేటు బయటే నిలబెట్టి.. తీరిగ్గా మీ వాహనాలను తనిఖీలు చేస్తారు.. ఆసిఫాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో నిత్యం చోటుచేసుకుంటున్న ఈ వింత పరిస్థితిని చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు

జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లా కార్యాలయానికి నిత్యం పదుల సంఖ్యలో కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్రవాహనాలు, లారీలు, ట్రాక్టర్లు, జీపులు, కార్లు రిజిస్ట్రేషన్‌ కోసం.. ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ కోసం వస్తుంటాయి. మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ)తోపాటు సిబ్బంది ఆయా వాహనాల ఇంజిన్‌, ఛాసీ నంబర్లను పరిశీలించిన తర్వాత.. ఆ దరఖాస్తులపై ఎంవీఐ సంతకం చేసి ఫైల్‌ను రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు పంపుతారు. అలాగే పాత వాహనం ఏదైనా ఫిట్‌నెస్‌ కోసం వస్తే ఆ వాహనం ఇంజిన్‌ సామర్థ్యం, టైర్లు, బ్రేకులు, హెడ్‌లైట్లు, సైడ్‌ ఇండికేటర్‌ లై ట్లు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం వాటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి ఎంవీఐ అధికారి సిఫార్సు చేస్తారు. వాహన డ్రైవింగ్‌ లైసెన్సుల కోసం వచ్చిన అభ్యర్థులు.. తమ సొంత వాహనాలతో డ్రైవింగ్‌ ట్రాక్‌పై టెస్ట్‌ రైడింగ్‌ చూపాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో అభ్యర్థికి రోడ్డు భద్రతా సెఫ్టీ రూల్స్‌ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తారు? వాటికి సరైన సమాధానం చెప్పిన వారిని పరీక్షలో ఉత్తీర్ణత సాధించనట్లుగా సిఫార్సు చేస్తూ ఫైల్‌పై ఎంవీఐ స్థాయి అధికారి సంతకం చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వతే నూతన వాహనానికి రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయిస్తారు. అనంతరం ఇతరత్రా పనులు సైతం జరుగుతాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా... ఆసిఫాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో మాత్రం వింత వైఖరి కొనసాగుతుండడంతో వాహనదారులు పెదవి విరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అన్నీ.. గేటు బయటే!1
1/1

అన్నీ.. గేటు బయటే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement