వినతులు పెండింగ్‌లో ఉంచొద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: ప్రజావాణిలో ప్రజలు సమర్పించే వినతులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని చింతలమానెపల్లి మండలం కర్జెల్లికి చెందిన చౌదరి ఓంకార్, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలం ఖమానకు చెందిన లోబడే దేవాజీ దరఖాస్తు చేసుకోగా, వితంతు పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం ఎడవెల్లికి చెందిన రాథోడ్ సునీత అర్జీ సమర్పించింది. జిల్లా కేంద్రంలోని నూర్‌నగర్ కాలనీలోని పోచమ్మ గుడి వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు వినతిపత్రం అందించారు. ఉపాధిహామీ పథకంలో పనిచేసిన కాలానికి డబ్బులు ఇప్పించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన కొండ మల్లయ్య కలెక్టర్‌కు విన్నవించాడు. కెరమెరి మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఏదైనా ఉద్యోగావకాశం కల్పించాలని సిర్పూర్ (యూ) మండలం ధనోరా– పి గ్రామానికి చెందిన రాథోడ్ ప్రియాంక, ఆశ కార్యకర్తగా ఉద్యోగావకా శం కల్పించాలని ఆత్రం నేహ దరఖాస్తు చేసుకున్నా రు. రాష్ట్రప్రభుత్వం చెల్లించే రైతు రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ చేయాలని రెబ్బెన మండలం నార్లాపూర్‌కు చెందిన పబ్బ శ్రవంతం అర్జీ సమర్పించింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరి ష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు సైతం సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలని జూమ్ విధానం ద్వారా ఆదేశించారు. గత జూలై 1 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ప్రజావాణిలో 6,091 దరఖాస్తులు రాగా, 5,586 దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. మరో 505 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ ప్ర భుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంపై ఫిర్యాదు
ఆసిఫాబాద్‌అర్బన్: ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన బెనిఫిట్స్ అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న బూర్గుడ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఉద్యోగి టి.సత్యనారాయణ ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఆసిఫాబాద్ మండలం రహపల్లి యూపీఎస్‌లో పనిచేసి రిటైర్డ్ కాగా, వైద్యబిల్లులు, 18 నెలల పేస్కేల్ మంజూరు చేయడం లేదని, ఆరు నెలలైనా పింఛన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment