నేడు దివ్యాంగులకు ఆటల పోటీలు
ఆసిఫాబాద్‌అర్బన్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 నుంచి 16 ఏళ్ల విభాగం, 17 నుంచి 54 ఏళ్ల విభాగం వారికి వేర్వేరుగా పోటీలు ఉంటాయని పేర్కొన్నా రు. అంధులకు పరుగుపందెం, షాట్‌ఫుట్, జావెలిన్ త్రో పోటీలు, శారీరక వికలాంగులకు మూడు చక్రాల సైకిల్‌తో పరుగు పందెం, చెస్, షాట్‌ఫుట్, క్యారమ్ పోటీలు, బధి రులకు పరుగు పందెం, షాట్‌ఫుట్, చెస్, క్యా రమ్ బోర్డు పోటీలు, మానసిక వికలాంగుల కు పరుగు పందెం, చెస్, షాట్‌ఫుట్, క్యారమ్ బోర్డు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
రేపు సన్నాహక సమావేశం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో డిసెంబర్ 14న ఉదయం 10.30 గంటలకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు కోర్టు భవనంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు. లోక్‌అదాలత్ కార్యక్రమంలో క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్, బ్యాంకింగ్, విద్యుత్, భూతగదాలు, వివాహ, కుటుంబ కేసులు, వాహన ప్రమాదాలు, చెక్‌బౌన్స్, ఇతర కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు కేసుల వివరాలతో సన్నాహక సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
‘సమగ్ర’ సర్వే 98శాతం పూర్తి
ఆసిఫాబాద్: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే సోమవారం నాటికి 98 శాతం పూర్తయింది. జిల్లావ్యాప్తంగా 1,62,853 గృహాలు ఉన్నా యి. వీటిలో 1,42,108 గ్రామీణ ప్రాంతంలో ఉండగా, 20,745 పట్టణ ప్రాంతాల్లో ఉన్నా యి. ఇప్పటివరకు 1,60,246 గృహాల సర్వే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. గ్రా మీణ ప్రాంతాల్లో 1,40,385 గృహాలు(99 శాతం), పట్టణ ప్రాంతాల్లో 19,861 గృహాల(96శాతం) వివరాలు సేకరించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలను ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment