రుచికరమైన భోజనం వండిపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

రుచికరమైన భోజనం వండిపెట్టాలి

Published Tue, Nov 26 2024 12:50 AM | Last Updated on Tue, Nov 26 2024 12:50 AM

రుచికరమైన భోజనం   వండిపెట్టాలి

రుచికరమైన భోజనం వండిపెట్టాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులకు రుచికరమై న భోజనం వండిపెట్టాలని ఇన్‌చార్జి డీఈవో ఉదయ్‌ బాబు అన్నారు. ఆసిఫాబాద్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం రుచికరమైన వంటలు చేసిన వారికి బహుమతులు ప్రదానం చేసి శాలువాతో సన్మానించా రు. ఇన్‌చార్జి డీఈవో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నాణ్యమైన సామగ్రి వినియోగించాలన్నారు. వంటల పోటీల్లో ప్రథమ బహుమతి భాగ్యలక్ష్మి(ఆసిఫాబాద్‌), ద్వితీయ మాయ(రెబ్బె న), తృతీయ బహుమతి రేవంతబాయి(కాగజ్‌నగ ర్‌) పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌, ఎంఈవో సుభాష్‌, ఉపాధ్యాయులు హేమంత్‌, ఊషన్న తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement