నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని మంగీ ఆశ్రమ పాఠశాలతోపాటు గుండాల గ్రామంలోని సబ్ సెంటర్, పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మంగీ పాఠశాల ఆవరణలో నిర్మించిన వాటర్ ట్యాంకు ద్వారా శుద్ధజలం అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణతేజను ఆదేశించారు. రొంపెల్లి నుంచి గుండాల వరకు రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతకు ముందు ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘం సమావేశానికి హాజరయ్యారు. బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం సుగుణ, జువ్వాజి అనిల్ గౌడ్, డీటీడీవో రమాదేవి, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, డీఈ రాజన్న, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో వేముల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment