పౌర్ణమి స్నానాలకు భారీ బందోబస్తు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మచిలీపట్నం మండలం మంగి నపూడి బీచ్‌లో శుక్రవారం జరిగే సముద్ర స్నానాలకు కృష్ణా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల నుంచి 358 మంది పోలీసులను రప్పించి బందో బస్తు డ్యూటీలు వేశారు. ఏడుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 15 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 73 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, 263 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ విధుల్లో నియమితులయ్యారు. ఎస్పీ ఆర్.గంగా ధర్‌రావు గురువారం మంగినపూడితో పాటు హంసలదీవిలో బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు. బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ సారధ్యంలో బందరు రూరల్ సీఐ ఏసుబాబు పర్యవేక్షణలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అణువణువునా నిఘా
సముద్రస్నానాలకు భక్తులు లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకున్నారు. అడుగడునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సముద్ర తీరం వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్ కెమెరాలను సిద్ధంచేశారు. బీచ్ ప్రాంతంలో భక్తులకు అనుకోని విధంగా ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పడు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి భక్తుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేలా చర్యలు తీసుకున్నారు.
ఐదు పార్కింగ్ ప్రదేశాలు
భక్తుల ద్విచక్ర వాహానాలు, కారులను పార్కింగ్ చేసుకునేందుకు మంగినపూడి బీచ్ సమీపంలో ఐదు పార్కింగ్‌లను ఏర్పాటుచేశారు. బీచ్‌కు వెళ్లే వాహనాలు తాళ్లపాలెం నుంచి గిరిపురం మీదుగా పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. మంగినపూడి బీచ్ అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్ వెనుక రెండు, మేరీమాత చర్చి సమీపంలో ఒకటి, గిరిపురం వద్ద రెండు పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దొంగల చేతివాటాన్ని అరికట్టేందుకు, ముఖ్యంగా మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకుని బందో బస్తులో భాగంగా ఐదు మొబైల్ టీంలను ఏర్పాటుచేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరు నిరంతరం నిఘా ఉంచి నేరాలను అరికడతారు.
నేరాలను పసిగట్టేందుకు మఫ్టీ సిబ్బంది
భక్తుల రద్దీ అధికంగా ఉండే మంగినపూడి బీచ్, చిలకలపూడి పాండురంగస్వామి గుడి ప్రాంతాల్లో దుండగులు నేరాలకు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో నేరస్థుల కదలికలను పసిగట్టేందుకు మఫ్టీ సిబ్బంది ప్రత్యేకంగా నియమించారు. వారి కోసం పాల్‌కనా అనే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేశారు. బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గంగాధర్‌రావు, డీఎస్పీ అబ్దుల్ సుభాన్ పర్యవేక్షించారు.
అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment