కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025
దేశ భద్రత
మనందరి బాధ్యత
కోస్ట్‌గార్డు కమాండెంట్ మురళీ
కోనేరుసెంటర్: దేశ భద్రత మనందరి బాధ్యత అని కోస్ట్‌గార్డ్ కమాండెంట్ కె. మురళీ అన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ రైజింగ్ డేను పురస్కరించుకుని విశాఖపట్నం నుంచి బైక్‌లపై ర్యాలీగా బందరు చేరుకున్న కోస్ట్‌గార్డ్ అధికారులు గురువారం గిలకలదిండిలోని మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మురళీ మాట్లాడుతూ దేశ భద్రతకు సంబంధించి భద్రతా దళాలకు ఎంత బాధ్యత ఉంటుందో దేశ పౌరులకూ అంతే బాధ్యత ఉంటుందన్నారు. సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇతర ప్రాంతాల నుంచి మన సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల సమాచారం తెలిసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నారు. అలాంటి సంఘటనలు తారస పడితే తక్షణమే అందుబాటులోని కోస్ట్‌గార్డ్, మైరెన్ పోలీసులకు సమాచారం ఇచ్చి దేశ రక్షణలో భాగస్వాములు కావాలన్నారు. అలాగే వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా లైఫ్‌జాకెట్‌లను వెంట తీసుకువెళ్లాలన్నారు. సముద్రంలో మద్యం తాగ డం వంటి చర్యలకు పాల్పడకూడదన్నారు.
సరిహద్దులు దాటొద్దు..
గిలకలదిండి మైరెన్ ఎస్‌ఐ చంద్రబోస్ మాట్లాడుతూ బోట్లు మన సరిహద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లైసెన్స్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. బోట్లకు నంబర్‌లను తప్పనిసరిగా వేయించాలన్నారు. అలాగే బోట్లపై జాతీయజెండా ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ శివబాలన్, జేజి ప్రకాష్, ఆనంద్ కుమార్ కరోడా, హార్తిఆచార, గిలకలదిండి మైరెన్ ఎస్‌ఐ పరింకాయల మురళీకృష్ణ, మత్స్యకారులు పాల్గొన్నారు.
గుడ్లవల్లేరు: కూటమి ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోంది. ఏళ్లుగా వేధిస్తున్న భూ సమస్యలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పరిష్కారం దిశగా అడుగులు వేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పక్కకు తోసేస్తూ.. మళ్లీ ఆ భూములు ‘చెర’ పట్టేలా చేస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు 22ఏ నిషేధ జాబితా, అసైన్డ్ భూములు. జిల్లాలోని అవనిగడ్డలో 16వేల ఎకరాలను నిషేధిత భూములుగా 2007లోనే చంద్రబాబు ప్రకటించారు. 22–ఏ కింద ఉన్న ఆ భూములకు నిషేధాన్ని 2023లో రద్దు చేసి జగన్ ఊరటనిచ్చారు. కానీ ఇప్పుడు ఆ భూములకు రిజిస్ట్రేషన్లు కానివ్వకుండా బాబు సర్కార్ ఆంక్షలు విధించింది. అదే క్రమంలో పేదల అసైన్డ్ భూములకు సంబంధించి గత ప్రభుత్వంలో అసైన్డ్ భూముల బదిలీల నిషేధ చట్టం 1977కి సవరణలు చేస్తూ.. పేదలకు భూములపై పూర్తి హక్కులను కల్పించారు. అన్యాక్రాంతంలో ఉన్న భూములను కబ్జాదారుల నుంచి చెర విడిపించేలా అడుగులు వేశారు. అయితే ప్రస్తుత కూటమి సర్కార్ దీనినీ తుంగలో తొక్కింది. అంతే కాక ఆ అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలపై కనీసం రెవెన్యూ సదస్సుల్లో బాధితులు ఇచ్చే అర్జీలను కూడా అధికారులు తీసుకోకుండా పక్కన పెట్టేస్తుండటంతో పేదలు ఆవేదన చెందుతున్నారు.
అసైన్డ్ పాపం బాబుదే..
జిల్లాలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూముల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కృష్ణా జిల్లాలో 27వేల ఎకరాల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే అసైన్డ్ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించారు. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో కూడా ఆ అసైన్డ్ భూముల సమస్యలపై ఏ బాధితుడు అర్జీ ఇచ్చినా.. అధికారులు సరిగా స్వీకరించకుండా లైట్‌గా తీసుకున్నారు.
అర్జీలు తీసుకోడానికి కూడా నిరాకరణ..
● పేదల భూ సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని జిల్లాలోని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్నం మండలం కానూరు రెవెన్యూ సదస్సులో అసైన్‌మెంట్ సమస్యల అర్జీలు వస్తే.. తీసుకోకుండా అధికారులు పక్కన పెట్డడంతో బాధితులు అవాక్కయ్యారు.
● మచిలీపట్నం మండలం కానూరులో దాదాపు వెయ్యి ఎకరాల ఎస్సీ, మత్స్యకార సొసైటీలకు చెందిన భూముల సమస్యలు 40–50ఏళ్ల నుంచి తీరకుండా పడి ఉన్నాయి. వీటిపి పరిష్కరించాలంటూ అర్జీలను ఇటీవల ఇచ్చినా.. ఈ అర్జీల స్వీకరణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తిప్పి కొట్టారు.
● పెద తుమ్మిడిలో 1,500 నుంచి 2వేల ఎకరాల ఉప్పుటేరు పర్రను పేదలకు 1985–90 మధ్యలో ప్రభుత్వాలు పంచిపెట్టాయి. ఒక్కొక్కరికీ ఎకరం నుంచి రెండున్నర ఎకరాల చొప్పున పంపిణీ చేశాయి. కానీ ఆ ఫలాలు పేదలకు అందడం లేదు. వాటి సమస్యను తీర్చేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావటం లేదు.
● పామర్రు మండలం ఐనంపూడిలో 11ఎకరాల కోసం ఎన్నో న్యాయ పోరాటాలు జరిగాయి. ఉన్నతాధికారులు, పోలీసుల అండతో ఈనాటికి ఆ భూములు పేదలకు దక్కలేదు.
● గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో 20ఎకరాలకు పైబడి ఎస్సీల అసైన్డ్ భూములు ఉన్నాయి. అప్పట్లో గ్రామ స్థాయి అధికారులు ఎస్సీలతో పాటు స్థానికేతరులైన ఓసీ వర్గాల వారికి కూడా పంచిపెట్టినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు సంబంధించిన 34మంది లబ్ధిదారులైతే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోతే.. మరి కొంతమంది చనిపోయారు. అయినా ఈ భూములను కొంతమంది కబ్జాదారులే పండించుకుంటున్నారు. రీ–సర్వే అనంతరం ఈ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులు చెప్పినా.. కొంతమంది అధికారుల ప్రోద్బలంతో ఆ కబ్జాదారులే ఎస్సీల భూములను అనుభవిస్తున్నారు.
7
న్యూస్‌రీల్
పేదల భూములు ‘చెర’ వీడేదెప్పుడో?
గత ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలు నిలిపివేత చుక్కల భూములకు మళ్లీ చిక్కులు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లకూ ఆంక్షలు పేదల పక్షాన మేలు చేయని సర్కార్ జిల్లాలో 27వేల ఎకరాల్లో అసైన్డ్ భూములు
పేదలకు పంచవలసిన భూములను పంపిణీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ అవకాశాన్ని అధికారులు ఆసరాగా తీసుకుని మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మా కుటుంబంతో పాటు 15కుటుంబాల వారు ఎన్నో ఏళ్లుగా భూములు ఇవ్వకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
– వల్లారపు రమేష్‌బాబు, బాధితుడు,
జానకీరామపురం, బంటుమిల్లి మండలం
ప్రభుత్వం ఇచ్చిన భూమిని మాకు ఇచ్చేందుకు అధికారులు రూ.లక్షల్లో లంచాలు అడుగుతుంటే ఏం చేయాలి. ఆ భూమి మీద ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. ఆ భూమిని ఇస్తారని ఎదురు చూస్తున్నా. జిల్లా అధికారుల నుంచి ఢిల్లీ వరకు ఈ భూముల గురించి తిరిగేందుకే నా జీవితమంతా సరిపోయింది.
– మురాల వెంకటేశ్వరరావు,
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి
జిల్లాలో అసైన్‌మెంట్ భూముల వివరాలివి..
నియోజకవర్గం భూమి(ఎకరాల్లో)
మచిలీపట్నం 12,547.43
పెడన 3,981.65
అవనిగడ్డ 7,679.68
గుడివాడ 649.51
గన్నవరం 1,539.76
పెనమలూరు 142.69
పామర్రు 463.4
మొత్తం 27,004.12
Comments
Please login to add a commentAdd a comment