రోడ్డున పడిన కుటుంబం
ఇతని పేరు బి. నాగరాజు (38). చిప్పగిరి మండలం బంటన్హాల్ గ్రామానికి చెందిన ఈయనకు సొంత భూమి 4.38 ఎకరాలు ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో మిరప సాగు చేశారు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు అధిక వర్షాలతో పంట దెబ్బతినింది. బ్యాంకులో రూ.80 వేలు, ప్రైవేటు అప్పు 14.50 లక్షలు ఉంది. వీటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో సెప్టెంబరు 22న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిని మండల స్థాయి అధికారులు తహసీల్దారు, సబ్ ఇన్స్పెక్టరు, మండల వ్యవసాయ అధికారి ప్రాథమికంగా నిర్ధారించి రిపోర్టు కూడా పంపారు. త్రీమెన్ కమిటీ ఎప్పుడు విచారణ జరుపుతుందనేది తెలియడం లేదు. సంపాదించే వ్యక్తి మరణించడంతో బాధిత కుటుంబం మాత్రం రోడ్డున పడింది.
Comments
Please login to add a commentAdd a comment