రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. | - | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగులకు శుభవార్త..

Published Tue, Jun 25 2024 1:34 AM | Last Updated on Tue, Jun 25 2024 1:34 AM

రైల్వ

కాజీపేట రూరల్‌: ఏపీఏఆర్‌ హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో గుడ్‌ లేదా తక్కువ గ్రేడ్‌ పొందిన రైల్వే ఉద్యోగులకు సంబంధించి తిరిగి రివ్యూ అవకాశం ఇస్తూ రైల్వే బోర్డు ఉత్వర్వులు జారీ చేసిందని రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ సెక్రటరీ పి.రవీందర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022–23 నాటికి లోయర్‌ గ్రేడ్‌ మూలంగా ఎంఏసీపీఎస్‌ పొందే అవకాశం కోల్పోయిన ఉద్యోగులకు ఇప్పుడు జూలై 15, 2024 లోపు హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో ఏపీఏఆర్‌ సమీక్ష (రివ్యూ) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మాడిఫైడ్‌ ఆష్యూర్‌ కెరీర్‌ ప్రొగ్రెషన్‌ స్కిల్‌ (ఎంఏసీపీఎస్‌.. పదోన్నతులు రాని రైల్వే ఉద్యోగులకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పదోన్నతి కల్పించే స్కీం) స్కీం కింద రైల్వే కార్మికులకు లేదా ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తారు. దీనికి గాను రైల్వే కార్మికులు, ఉద్యోగులు సర్వీస్‌ రికార్డులో మూడు ఏళ్లు వరుసగా వెరి గుడ్‌ ఫర్ఫామెన్స్‌ కలిగి ఉండాలి. గుడ్‌ ఫర్ఫామెన్స్‌ లేని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి ఒప్పుకుంటే వెరి గుడ్‌గా మర్చే అవకాశం ఉంది. ఈ స్కీంతో పదోన్నతి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

దొంగ అరెస్ట్‌, రిమాండ్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ పట్టణంలోని శ్రీఅయ్యప్ప గోల్డ్‌ షాపులో చోరీకి పాల్పడిన ఓ యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని టౌన్‌ సీఐ పెండ్యాల దేవేందర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం టౌన్‌ పోలీసు స్టేషన్‌లో దొంగ అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ రాత్రి పట్టణంలోని రున్వాల్‌ బన్సీలాల్‌కు చెందిన శ్రీఅయ్యప్ప గోల్డ్‌ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితుడు రున్వాల్‌ బన్సీలాల్‌ ఆదివారం రాత్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రైల్వే స్టేషన్‌ ఆవరణలో టౌన్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని విచారించి పాత నేరస్తుడు చత్రి విజయ్‌ కుమార్‌గా గుర్తించారు. అనంతరం చోరీ ఘటనపై మరోసారి విచారించగా శ్రీఅయ్యప్ప గోల్డ్‌ షాపులో చోరీ చేసింది తానేనని, ఆ వస్తువులను వరంగల్‌లో విక్రయించడానికి తీసుకెళ్తున్నానని ఒప్పుకున్నాడు. దీంతో విజయ్‌ కుమార్‌ను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, ఫిర్యాదు చేసిన 24 గంటలలోపే దొంగను పట్టుకున్న టౌన్‌ సీఐ దేవేందర్‌, ఎస్సై బి.విజయ్‌ కుమార్‌, సిబ్బందిని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు.

భర్త వేధింపులతోనే శ్రావణి ఆత్మహత్య

నరేశ్‌పై కేసు నమోదు.. రిమాండ్‌ తరలింపు

వివరాలు వెల్లడించిన ఎస్సై సాంబమూర్తి

గణపురం: గణపురం మండలం కర్కపల్లి పంచాయతీ కార్యదర్శి పల్లెబోయిన శ్రావణి ఏప్రిల్‌ 21వ తేదీన గాంధీనగర్‌లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శ్రావణి తండ్రి సాంబయ్య తన కూతురు ఆత్మహత్యకు అల్లుడు నరేశ్‌ కారణమని, అతడి వేధింపులతోనే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు రెండు నెలల తరువాత శ్రావణి.. తన భర్త నరేశ్‌ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తమ విచారణలో తేలిందని వివరించారు. సోమవారం నరేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రైల్వే ఉద్యోగులకు  శుభవార్త..
1/1

రైల్వే ఉద్యోగులకు శుభవార్త..

Advertisement
 
Advertisement
 
Advertisement