కాంగ్రెస్‌వి సాధ్యం కానీ హామీలు.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌వి సాధ్యం కానీ హామీలు..

Published Thu, May 9 2024 4:50 AM

కాంగ్రెస్‌వి సాధ్యం కానీ హామీలు..

హన్వాడ: కాంగ్రెస్‌ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తర్వాత ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నెశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మండలంలోని వేపూర్‌, మునిమోక్షం, తదితర గ్రామాల్లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని, మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్‌ కోతలు, తాగునీటి సమస్య అధికమైందని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్‌రాజు, రమణారెడ్డి, చెన్నయ్య, నరేందర్‌, బాలయ్య, కృష్ణయ్యగౌడ్‌, నాగయ్య, బసిరెడ్డి పాల్గొన్నారు.

నేను మీ మన్నెని.. మీలో ఒకడిని...

నవాబుపేట: ‘నేను మీ మన్నెని.. ఓట్ల కోసం వచ్చిన వ్యక్తిని కాను.. మీలో ఒకడిని.. మీతో నిరంతరం ఉండే వ్యక్తిని.. ఎంపీగా మరోసారి అవకాశమిస్తే సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది.’ అంటూ మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి నవాబ్‌పేటలో ప్రసంగించారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మధ్యఉండే నాయకుడినని.. రెండోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకుల మాయమాటలు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన ప్రజలు చాలా తప్పు చేశామని బాధపడుతున్నారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తప్పు సరిద్దిదుకోవాలని కోరారు. బీజేపీ సైతం పదేళ్లు మాటలతో పబ్బం గడిపిందని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. పార్టీ జిల్లా నాయకులు రవీందర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ లక్ష్మయ్య, ఎంపీపీ అనంతయ్య, ప్రతాప్‌, సంతోష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గోపాల్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌, కృష్ణగౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, అంజయ్య, నర్సింహులు, శ్రీశైలం పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌

ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement