స్పెల్–బీ, మ్యాథ్స్–బీ పరీక్షలకు అనూహ్య స్పందన
విద్యార్థుల్లో ఇంగ్లిష్‌పై ఆసక్తి పెంచడం.. గణిత చతుర్విత ప్రక్రియలపై మక్కువ పెంపొందించేందుకు గాను ‘సాక్షి’, అసోసియేట్ స్పాన్సర్ పార్టనర్ ట్రాప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి, ప్రెసెంటింగ్ స్పాన్సర్ డ్యూక్స్ వెపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్పెల్–బీ, మ్యాథ్స్–బీ పరీక్షలకు విశేష స్పందన లభించింది. రెండు వారాల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ఎంపికై న విద్యార్థులకు ఆదివారం మహబూబ్‌నగర్‌లోని మౌంట్‌బాసిల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో క్వార్టర్ ఫైనల్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 250 మందికి పైగా విద్యార్థులు స్పెల్–బీ, మ్యాథ్స్–బీలకు హాజరై ఉత్సాహంగా పరీక్షలు రాశారు. వివిధ స్థాయిల్లో నిర్వహించే ఈ పరీక్షలను రాయడం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకోవడంతో పాటు గణితం, ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. – మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్
ఇంగ్లిష్ గ్రామర్ రావాలని..
స్పెల్–బీ పరీక్ష గతంలో కూడా రాశాను. దీన్ని వల్ల ఇంగ్లిష్ గ్రామర్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించగలను అనే నమ్మకం వచ్చింది. పరీక్షలో ప్రశ్నలను చూస్తే సులభంగా సమాధానాలు రాయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది. పాఠశాల స్థాయిలోనే ఒక పోటీ పరీక్ష రాశామన్న సంతోషం ఉంది. మంచి మార్కులు సాధిస్తా.
– కార్తీక్, 8వ తరగతి,
అక్షర స్కూల్,
కొల్లాపూర్
సులభంగా రాశాను..
స్పెల్–బీ పరీక్ష రాసే క్రమంలో ప్రశ్నలు సులువుగా అర్థమయ్యే విధంగా ఉండటంతో జవాబులను కూడా సులభంగా రాశాను. ఈ పరీక్ష రాయడం వల్ల ఏ పరీక్ష అయినా సులభంగా రాయగలనని అనిపించింది. ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహించినా నేను రాస్తాను. దీంతో ఇంగ్లిష్ మరింత నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
– గ్రీష్మిక, 7వ తరగతి, మౌంట్‌బాసిల్ స్కూల్, మహబూబ్‌నగర్
నైపుణ్యం పెరుగుతుంది..
ఈ పరీక్షతో కాంపిటేటివ్ స్కిల్ పెరుగుతుందని భావిస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా ‘సాక్షి’ స్పెల్–బీ పరీక్ష రాస్తున్నా. పరీక్షకు సంబంధించిన మెటీరియల్ ద్వారా ఇంగ్లిష్ ప్రనౌన్సియేషన్, లిటరేచర్ స్కిల్ వంటి వాటికి ఎంతో ఉపయోగపడుతుంది. పరీక్ష రాసిన ప్రతిసారి చాలా అంశాలను నేర్చుకుంటున్నా.
– కీర్తన, 9వ తరగతి, పీపుల్స్ స్కూల్, కొత్తకోట
పరీక్షలో తప్పులు దొర్లకుండా నేరుగా సమాధానం రాసే విధంగా ప్రశ్నలు ఉన్నాయి. పరీక్ష బాగా రాశాను. మంచి మార్కులు సాధిస్తా. ఎప్పుడు పరీక్ష నిర్వహించినా పాల్గొంటా. ‘సాక్షి’ స్పెల్–బీ పరీక్ష రాయడం మంచి అనుభవాన్ని ఇచ్చింది. గ్రామర్, స్పెల్లింగ్ వంటి వాటికి సంబంధించి పరీక్ష ఎలా రాయాలనే విషయం తెలిసి వచ్చింది.
– సాహితి, 7వ తరగతి, అపెక్స్ స్కూల్, మహబూబ్‌నగర్
●
Comments
Please login to add a commentAdd a comment