‘మాలలపై చిన్నచూపు తగదు’
మహబూబ్‌నగర్ రూరల్: రాజకీయ పార్టీలు మాలలను చిన్నచూపు చూస్తున్నాయని జాతీయ మాలల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుమార్ల నిరంజన్ అన్నారు. వచ్చే నెల 1న నిర్వహించే మాలల సింహగర్జన బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆదివారం మహబూబ్‌నగర్‌లోని టీఎన్జీఓస్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల సంఖ్య తక్కువ ఉందనే ఆలోచనలో అన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మాలల సంఖ్యను గత 30 ఏళ్లుగా తక్కువగా చిత్రీకరిస్తూ వారి సంఖ్యను తక్కువగా చూపిస్తూ మాదిగ దండోరా నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ శాతాన్ని పెంచమని కోరకుండా వర్గీకరణ చేయాలని మాదిగలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్న ఉద్దేశంతోనే డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్గీకరణపై వేసినటువంటి కమిషన్ విరమించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో కొనసాగుతున్న జాగో మాలల నినాదంతో మాలలంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో మాలల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమాకాంత్, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్, న్యాయ సలహాదారు కృష్ణ, ఆంజనేయులు, కృష్ణయ్య, శ్రీనివాసులు, చంద్రకాంత్, వెంకటయ్య, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment