నాన్‌టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీయూ నాన్‌టీచింగ్ సంఘం ఆధ్వర్యంలో వీసీ జీఎస్ శ్రీనివాస్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రా మ్మోహన్, బుర్రన్నలు మాట్లాడుతూ యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, నా లుగేళ్లుగా వేతనాల్లో పెరుగుదల లేదని, చాలీచాల ని జీతాలతో పనిచేస్తున్న తమకు వేతనాలను పెంచాలని కోరారు. ఎవరికీ జాయినింగ్ ఆర్డర్స్, ఐడీ కార్డులు లేవని వెంటనే వాటిని ఇప్పించాలని కోరారు. దీనిపై వీసీ స్పందిస్తూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సమస్యలు పెట్టి కొన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పర్వతాలు, రాగిణి, కోశాధికారి రాజేందర్, జమీల్, నరేష్ భరత్, రామకృష్ణ, యాదయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment