నేడు మంత్రులు ఉత్తమ్, పొన్నం రాక
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: రైతు పండుగలో భాగంగా శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా, బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాకు రానున్నారు. మంత్రి ఉత్తమ్ ముందుగా అమిస్తాపూర్‌లోని నిర్వహిస్తున్న రైతు పండుగలో వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం ధాన్యం సేకరణపై మహబూబ్‌నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పౌరసరఫరాల అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షిస్తారు. ఈ మేరకు అధికారులు సకాలంలో హాజరుకావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్యాహ్నం 3 గంటలకు అమిస్తాపూర్ చేరుకొని ఈ నెల 30న సీఎం సభ, ప్రజాపాలన విజయోత్సవాలు, రైతు పండుగ ఏర్పాట్లపై సమీక్షిస్తారు. అనంతరం నాగర్‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.
1 నుంచి ‘ఓపెన్’ డిగ్రీ,పీజీ తరగతులు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: డిసెంబర్ 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమయవుతాయని రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఐడీ కార్డు, ఫీజులు చెల్లించిన రశీదులు తీసుకొని రావాలని సూచించారు.
ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా సంతోష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీసీ రీజియన్ మేనేజర్‌గా పి.సంతోష్‌కుమార్ రానున్నారు. ఇక్కడ ఆర్‌ఎంగా పనిచేస్తున్న వి.శ్రీదేవి హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు బదిలీ అయ్యారు. మూడు, నాలుగు రోజుల్లో నూతన ఆర్‌ఎం బాధ్యతలు చేపట్టనున్నారు. సంతోష్‌కుమార్ రంగారెడ్డి రీజియన్ డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తుండగా.. పదోన్నతిపై మహబూబ్‌నగర్‌కు ఆర్‌ఎంగా నియమితులయ్యారు. ఇతను 2000లో మొదట ఒంగోలు జిల్లా గిద్దలూరు డిపో మేనేజర్‌గా విఽధుల్లో చేరారు. తర్వాత కామారెడ్డి, జీడిమెట్ల, 2010లో సిటీలో డిప్యూటీ సీఎంఈగా పదోన్నతి పొందారు. డిప్యూటీ సీఎంఈగా మెదక్‌తో పాటు హెడ్‌ఆఫీస్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా, కార్గోలో రెండేళ్ల పాటు హెడ్‌గా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాకు డిప్యూటీ ఆర్‌ఎంగా వచ్చారు.
బాదేపల్లి యార్డులో జోరుగా కొనుగోళ్లు
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వ్యవసాయ పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి 9,187 క్వింటాళ్ల ధాన్యం ,835 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలు గరిష్టంగా రూ.2,441, కనిష్టంగా రూ.2,169 ధరలు లభించాయి. అదేవిధంగా ధాన్యం హంస రకం గరిష్టంగా రూ.2,141, కనిష్టంగా రూ.2,070, ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,789, కనిష్టంగా రూ.1,736, వేరుశనగ గరిష్టంగా రూ.6,892, కనిష్టంగా రూ.5,832 ధరలు పలికాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,672, కనిష్టంగా రూ.2,200గా ధర లభించింది. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment