శిక్షణ ఐఏఎస్‌ల క్షేత్రస్థాయి పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో గురువారం ఐదుగురు శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ముందుగా 19, 21, 37వ వార్డులలో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ వెంకటేశ్వరరావు, టీపీఓ లక్ష్మీపతి, ఏఓ ఉమాకాంత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గురులింగంలతో మాట్లాడారు. ముఖ్యంగా ఆస్తిపన్ను, మున్సిపల్ దుకాణాల అద్దె, నల్లాబిల్లుల వసూళ్లు, కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ అధికారులు, సిబ్బంది వివరాలతో పాటు వారి జీతభత్యాలను, ఎవరు ఏయే పనులు నిర్వహిస్తారో, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ, వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్‌లోని డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడి డీఆర్‌సీసీలో పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే విధానాన్ని చూశారు. అలాగే తడి చెత్తతో కంపోస్టు ఎరువుల తయారీపై అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో గౌరవ్‌గోస్వామి, ఆకాశ్‌శర్మ, అరిహంత్‌కొచర్, మనోజ్‌కుమార్, అంకిత్‌తారక్ ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, వజ్రకుమార్‌రెడ్డి, ఎస్‌బీఎం కన్సల్టెంట్ సుమీత్‌రాజ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ చరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment