సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.70 వేల కోట్ల కంటే తక్కువ రుణభారం ఉండేది. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏకంగా రూ.8లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఈ అప్పులకు గడిచిన పది నెలల్లో సుమారు రూ.60 వేల కోట్లు వడ్డీ కిందనే చెల్లించాం. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా.. మాది రైతు ప్రభుత్వం కనుకే రూ.18 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేశాం. సన్నాలకు గిట్టుబాటు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తున్నాం.
– జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి
పది జిల్లాల్లో ప్రతి ఏటా నిర్వహించాలి..
117 స్టాళ్లతో ఏర్పాటుచేసిన ఇంత గొప్ప రైతు సదస్సును ఇప్పటివరకు నేను చూడలేదు. వ్యవస్థ అనేది శాశ్వతం, పాలించే నాయకుల నిర్ణయాల్లో దార్శనికత, అంకిత భావం ఉండాలి. అలాంటి నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, ఆధునిక పద్ధతులు, ఆధునిక వంగడాలపై సాంకేతికతను మేధావుల చేత రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు ప్రయోజనకరమైన ఇలాంటి సదస్సును రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల్లో ప్రతి ఏటా నిర్వహిస్తే బాగుంటుంది.
– దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి
●
Comments
Please login to add a commentAdd a comment