జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇంకా వివరాలు నమోదు చేసుకోలేని కుటుంబాలు ఉంటే వారి మండల పరిధిలోని ఎంపీడీఓలు, పట్టణంలో మున్సిపల్ కమిషనర్లను సంప్రదించి తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 99.8 శాతం పూర్తయిందని చెప్పారు. ఇంకా సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోలేని వారు అడ్డాకుల ఎంపీడీఓ సెల్ నం.80089 01092, బాలానగర్ ఎంపీడీఓ సెల్ నం.80089 01006, భూత్పూర్ ఎంపీడీఓ సెల్ నం.80089 01007, చిన్నచింతకుంట ఎంపీడీఓ సెల్ నం.80089 01051, దేవరకద్ర ఎంపీడీఓ సెల్ నం.80089 01053, హన్వాడ ఎంపీడీఓ సెల్ నం.80089 01009, జడ్చర్ల ఎంపీడీఓ సెల్ నం.80089 01011, కోయిల్‌కొండ ఎంపీడీఓ సెల్ నం.80089 01014, మహబూబ్‌నగర్ ఎంపీడీఓ సెల్ నం.80089 01021, మిడ్జిల్ ఎంపీడీఓ సెల్ నం.80089 01022, నవాబ్‌పేట ఎంపీడీఓ సెల్ నం.80089 01023, మూసాపేట్ ఎంపీడీఓ సెల్ నం.94913 77825, గండేడ్ ఎంపీడీఓ సెల్ నం.99499 95465, రాజాపూర్ ఎంపీడీఓ సెల్ నం.99121 95696 సంప్రదించాలని చెప్పారు. అలాగే మున్సిపాలిటీల్లో మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ సెల్ నం.73311 84222, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సెల్ నం.73373 51867, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్ సెల్ నం.81217 21965లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment