కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు
అలంపూర్: పసిపిల్లలను అపహరించిన కిడ్నాపర్లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అపహరణకు గురైన పసిపిల్లలను, నిందితులను పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద పట్టుకొని.. హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి ఎస్ఐ మహేష్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో 45 రోజుల వయసు ఉన్న పిల్లాడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. పసిపిల్లాడి తల్లి హసీనా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పసిపిల్లాడిని అపహరించిన వాహనం కర్నూలు వైపు వెళ్తుందని నిర్ధారించారు. దీంతో ఉన్నతాధికారుల సమాచారంతో ఉండవెల్లి ఎస్ఐ మహేష్, మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ సిబ్బందితో ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఓమ్నీ వ్యాన్‌ను తనిఖీ చేయగా అందులో ముగ్గురు పసిపిల్లలు, ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. పసిపిల్లలో ఇద్దరు మగ పిల్లలు కాగా.. మరొకరు ఆడబిడ్డ ఉండగా.. రూ.20 వేల నగదు లభించింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పోలీసులు ముగ్గురు పసిపిల్లలు, ముగ్గురు నిందితులు, ఓమ్నీ వ్యాన్‌తోపాటు రూ.20 వేల నగదును నాంపల్లి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.
హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి చిన్నారి అపహరణ
జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద పట్టివేత
నాంపల్లి పోలీసులకు అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment