ధరూరు/ మదనాపురం: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తుందని పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 1,507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి చేపట్టారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 1,204 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 730 క్యూసెక్కులు, కుడి కాల్వకు 450, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 100 క్యూసెక్కులు వదలగా.. మరో 72 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.480 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రామన్‌పాడుకు 730 క్యూసెక్కులు..
రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 730 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 988 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 25 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదిలామని ఏఈ వరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment