భయం పోతుంది..
మ్యాథ్స్–బీ పరీక్ష కోసం కొన్ని రోజులపాటు సిద్ధమయ్యా. ఇందుకోసం ఇచ్చిన మెటీరియల్‌ను చదివాను. పరీక్షలో వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశాను. పరీక్ష రాయడం మంచి అనుభూతినిచ్చింది. ఈ పరీక్ష రాయడం వల్ల సెల్ప్ కాన్ఫిడెన్స్ పెరిగింది. భవిష్యత్‌లో ఎలాంటి పరీక్ష అయినా సులభంగా రాయగలననే నమ్మకం ఉంది.
– విశిష్ట, 9వ తరగతి, మౌంట్‌బాసిల్ స్కూల్, మహబూబ్‌నగర్
పరీక్షలపై ఆసక్తి..
స్పెల్–బీ పరీక్ష వివిధ దశల్లో రాయడంతో పోటీ పరీక్షలపై ఆసక్తి పెరిగింది. పరీక్ష సమయం కంటే ముందుగానే పూర్తిచేశాం. ప్రతి ప్రశ్న సులభంగా అర్థం చేసుకునేలా ఉన్నాయి. పరీక్షలో మంచి మార్కులు సాధిస్తా. పాఠశాలలోనే కాకుండా బయట పరీక్షలను కూడా ఇబ్బందులు లేకుండా రాయగలమనే నమ్మకం పెరిగింది.
– ఛత్రపతి, 4వ తరగతి, మౌంట్‌బాసిల్ స్కూల్, మహబూబ్‌నగర్
సులభ పద్ధతిలో గణితం..
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యాథ్స్–బీ పరీక్షను గతంలో కూడా రాశాను. ఆ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. దీంతో ఈ సంవత్సరం కూడా పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాను. మ్యాథ్స్ చేయడానికి వచ్చినప్పటికీ.. సులభ పద్ధతిలో వేగంగా ప్రశ్నలకు సమాధానాలను రాసే విధంగా ఇక్కడ ఇచ్చిన మెటీరియల్‌లోని మెథడ్స్ ఉపయోగపడతాయి.
– మోనీష, 8వ తరగతి, మౌంట్‌బాసిల్ స్కూల్, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment