పటిష్ట భద్రత కల్పించాలి
మహబూబ్‌నగర్ క్రైం: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భూత్పూర్ సమీపంలోని అమిస్తాపూర్ దగ్గర ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న క్రమంలో బుధవారం భద్రతా ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ పర్యవేక్షించారు. ఎస్పీ జానకితో కలిసి సభాస్థలంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని, సభావేదిక, వీఐపీ ప్రాంతాలపై సమీక్ష నిర్వహించారు. దీంతోపాటు సభాప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ బందోబస్తుపై పరిశీలించారు. వీఐపీల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, నిషేధిత ప్రాంతాలను గుర్తించి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సభకు వచ్చే ప్రజల రాకపోకల సౌకర్యం కోసం ప్రత్యేక ట్రాఫిక్ మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ప్రధాన రహదారులు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేక భద్రతా బృందాలు, డ్యూటీ చార్టులను స్పష్టంగా కేటాయించాలని ఆదేశించారు. అత్యవసర సమయం కోసం ప్రత్యేక బృందాలను నియమించాలని, అంబులెన్స్, ఫైర్ సర్వీస్‌లను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment