సర్టిఫికెట్ ఒక ఎంట్రీ పాస్ వంటిది
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్ ఒక ఎంట్రీ పాస్ వంటిదని వీసీ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పీయూలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఇండక్షన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే సర్టిఫికెట్‌తోపాటు వివిధ రకాల నైపుణ్యాలు అవసరమని, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్, టీం మేనేజ్‌మెంట్ వంటివి ఉంటేనే ఉద్యోగానికి ఎంపికయ్యేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం వివిధ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటామని, వారి ద్వారా విద్యార్థులకు అవసరమయ్యే శిక్షణ అందిస్తామన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశపెట్టేందుకు మెషన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి మీద వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాటిని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు యూనివర్సిటీలో అనవసర విషయాల జోలికి వెళ్లకుండా చదువు మీద దృష్టిపెట్టాలని సూచించారు.
● వక్త, గ్లోబల్ స్పీకర్ రమేష్ వేముగంటి మాట్లాడుతూ పాలమూరు విద్యార్థులకు ప్రతిభలో కొదవలేదని, దానిని వెలికి తీసినప్పుడే గొప్ప వ్యక్తులుగా మారుతారన్నారు. యూనివర్సిటీ గత కొన్నేళ్లుగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని విద్యార్థుల ప్రాజెక్టు వర్కులు, ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల నాలెడ్డ్ పెరిగి చాలా త్వరగా ఉద్యోగాలు పొందవచ్చన్నారు. సమయాన్ని వృథా చేయకుండా, ఫోన్‌లో ఎక్కువ సమయం గడపకుండా తరగతి గదిలో చెప్పిన ప్రతి అంశాన్ని పరిశోధన కోణం చూసిన వారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఆలీమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌మోహన్, డీన్ ప్రొఫెసర్ జైపాల్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, వీసీ ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు చంద్రకిరణ్, నూర్జహాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణయ్య, భూమయ్య, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కోసం
వివిధ సంస్థలతో ఎంఓయూ
పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment