క్రీడా హబ్‌గా మహబూబ్‌నగర్ జిల్లా
మహబూబ్‌నగర్ క్రీడలు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన నెట్‌బాల్ సెలక్షన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెలక్షన్స్‌కు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా క్రీడలకు హబ్‌గా మారిందని, ఇక్కడి నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఏషియన్ గేమ్స్, ఇతర క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్ నిర్వహిస్తున్నామని, ఈ పోటీలతో క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికియతీయవచ్చన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కానుందని, దీంతో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌పీ వెంకటేశ్, కురుమూర్తిగౌడ్, నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలకులు గాడ్సన్‌బాబు, సరయు, వైష్ణవి, రాష్ట్ర క్రీడాప్రాదికారిక సంస్థ పరిశీలకులు సునీల్‌కుమార్, నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు విక్రమాదిత్య, ఖాజాఖాన్, సురేష్‌కుమార్, సాదత్‌ఖాన్, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా నెట్‌బాల్ జట్ల ఎంపికలు
వచ్చే ఏడాది జూన్‌లో కొరియాలో జరిగే ఏషియన్ యూత్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే మహిళా జట్టు, న్యూఢిల్లీలో వచ్చే ఏడాది మే నెలలో జరిగే ఏషియన్ మెన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే పురుషుల జట్టు మొదటి దఫా ఎంపికల్లో భాగంగా దక్షిణ భారతదేశ క్రీడాకారుల ఎంపికలు పూర్తిచేశామని నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి, ఎంపికల ఇన్‌చార్జ్ విక్రమాదిత్య తెలిపారు. ఈ ఎంపికలకు వివిధ రాష్ట్రాల నుంచి పురుషులు 25 మంది, మహిళలు 25 మంది పాల్గొన్నారన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జనవరిలో శిక్షణ ఉంటుందన్నారు.
జాతీయ క్రీడలకు రాష్ట్ర జట్ల ఎంపిక..
వచ్చే జనవరిలో ఉత్తరాఖండ్‌లో జరిగే 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ట్రెడిషనల్ నెట్‌బాల్ పురుషులు, మహిళలు, ఫాస్ట్– 5 పురుషులు, మహిళలు, మిక్స్‌డ్ అంశాల్లో రాష్ట్ర జట్లు అర్హత సాధించాయని, ఈ మేరకు క్రీడల్లో పాల్గొనే ఐదు జట్ల క్రీడాకారులను నెట్‌బాల్ సంఘం ప్రతినిధులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి 90 మంది పురుషులు, 80 మంది మహిళలు ఎంపికల్లో పాల్గొన్నారన్నారు. వీరిలో 50 మంది పురుషులు, 50 మంది మహిళలను వచ్చే నెలలో జరిగే కోచింగ్ క్యాంప్‌నకు ఎంపిక చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment