కాల్వకు గండి.. నీట మునిగిన పంటలు
రోడ్డు పనులను
అడ్డుకున్న గ్రామస్తులు
అయిజ: మండలంలోని బింగుదొడ్డి గ్రామ శివారులో నిర్మిస్తున్న భారత్మాల రోడ్డు పనులను ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. బింగుదొడ్డి సమీపంలోని చెరువులో భారత్మాల రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్.. మట్టిని తరలించారని తెలిపారు. గ్రామంలో పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు సగం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తిచేసిన తర్వాతే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జి ఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసాచారి అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో మా ట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment