జాతీయ జెండాకు అవమానం
భూత్పూర్ : గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగింది. జెండాను ఆవిష్కరించిన గంటకే త్రివర్ణ పతాకం నేలకొరిగింది. భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలోని ప్రాథమిక పాఠశాల ముందు జాతీయ జెండాను ఎగరవేయడానికి దిమ్మెను సైతం ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటుచేసిన దిమ్మెకు రంధ్రం చేసి వెదురుబొంగు కట్టెకు త్రివర్ణపతాకం, కాగితాలు అంటించి రాళ్లను పెట్టి జెండాను ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జెండా పండుగను జరుపుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. వారంతా వెళ్లిన గంటలోపే జాతీయ జెండా కింద పడిపోయింది. ఉపాధ్యాయుల అలసత్వం కారణంగా త్రివర్ణ పతకానికి అవమానం జరిగిందని వాల్యాతండా ప్రజలు ఆరోపిస్తున్నారు.
వాల్యాతండా ప్రాథమిక పాఠశాల
ఎదుట నేలకొరిగిన జాతీయ జెండా
ఆవిష్కరించిన గంటకే నేలకొరిగిన
త్రివర్ణ పతాకం
Comments
Please login to add a commentAdd a comment