పంటపొలంలో కొండచిలువ
వనపర్తి: వనపర్తి మండలం కాశీంనగర్ సమీపంలోని ఎర్రగట్టు తండాకు కూత వేటు దూరంలోని వ్యవసాయ పొలంలో సుమారు 11 ఫీట్ల కొండచిలువ బుధవారం రైతుల కంట పడింది. ఒక్కసారిగా భయపడి రైతులు, కూలీలు గట్టిగా కేకలు పెట్టారు. వెంటనే సాగర్ స్నేక్స్ సొసైటీ వారికి సమాచారం అందించారు. స్పందించిన సొసైటీ టీం అక్కడికి చేరుకొని పంటకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసుకున్న వలకు చిక్కిన సుమారు 18 కేజీల కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్లు సాగర్ స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు కృష్ణసాగర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment