వాటర్‌ పైపు పడి.. హాస్టల్‌ విద్యార్థిని తలకు గాయం | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ పైపు పడి.. హాస్టల్‌ విద్యార్థిని తలకు గాయం

Published Thu, Jan 30 2025 1:48 AM | Last Updated on Thu, Jan 30 2025 1:48 AM

-

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో బుధవారం ఓ విద్యార్థిని తలపై వాటర్‌ పైపు పడటంతో తీవ్రగాయమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్మీడియట్‌ (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందిని హాస్టల్‌ గదిలో ఉండగా.. ప్రమాదవశాత్తు వాటర్‌ పైపు పడటంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. గమనించిన హాస్టల్‌ సిబ్బంది చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తలకు వైద్యులు 15 కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, హాస్టల్‌ వద్ద ఉన్న వాటర్‌ పైపును కోతులు పెకిలించడంతో కింద పడిందని హాస్టల్‌ సిబ్బంది తెలిపారు. పైపులైన్‌ సరి చేయిస్తామని.. విద్యార్థిని నందినికి మెరుగైన వైద్యం చేయిస్తున్నామని వార్డెన్‌ ఎల్లమ్మ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement