ఎర్రవల్లి: చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందన ఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ స్వాతి కథనం మేరకు.. రాజోళి మండల కేంద్రానికి చెందిన రవికుమార్ కొంతకాలంగా మానవపాడు మండలంలోని చండూరులో కోళ్ల ఫారం లీజుకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె రక్షిత (2)ను ఊయలలో పడుకోబెట్టి కూలర్ వేసి పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో షార్ట్‌సర్క్యూట్‌తో కూలర్లో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పక్కనే ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూల్‌కు తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం చిన్నారి మృతి చెందింది. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment